ఇందూరు, ఆగస్టు 2: శాస్త్ర, సాంకేతిర రంగంలో నానో పార్టికల్స్‌తో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తెలంగాణ వర్సిటీలోని ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, అల్ట్రాసోనిక్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో సోమవారం ప్రా రంభమైన కాన్ఫరెన్స్ రెండో రోజూ కొనసాగింది. ‘అల్ట్రాసోనిక్స్ అండ్ మెటీరియల్ సైన్స్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ’ (ఐసీయూఎంఎస్ఏటీ-2022) అనే అంశంపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మంగళవారం రెండు సమాంతర సాంకేతిక సమావేశాలను ఏర్పాటు చేశారు. ఉద యం సెషన్లో సౌత్ ఆఫ్రికాలోని డర్బన్‌లోని స్కూ ల్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్, యూనివర్సిటీ ఆఫ్ క్వాజులు – నాటల్ నుంచి విచ్చేసిన ప్రొఫెసర్ శ్రీకాంత్, బి. జొన్నలగడ్డ మాట్లాడారు. అల్ట్రాసౌం డ్ అండ్ మై క్రోవేవ్ రేడియేషన్‌పై అవగాహన కల్పించారు.ఈ రేడియేషన్ ద్వారా ఎన్ని మాలిక్యూర్స్ తయారు చేయవచ్చో వివరించారు. అల్ట్రాసౌండ్స్ అంటే ధ్వని తరంగాలను విస్తృతంగా వ్యాపింపజేసేవని, మైక్రోవేవ్స్అంటే ధ్వని తరంగాలను పరిమితంగా వ్యాపింపజేసేవని ఉదాహరణల తో పేర్కొన్నారు. కెమిస్ట్రీలో కొత్త కంపౌండ్స్ ప్రత్యుత్పత్తి చేసే విధానాన్ని తెలిపి, వాటి ఉపయోగాలను వివరించారు.
పార్టికల్స్‌తో మమేకం
ఎస్ఎన్బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్స్ కల్కొతా ఎమిరిటిస్ ప్రొఫెసర్, జర్నల్ ఆఫ్ మెటీరియల్స్ కెమిస్ట్రీ మేటిరియస్ అడ్వాన్సెస్ (ఆర్ఎస్సీ) అసోసియేట్ ఎడిటర్ డాక్టర్ గౌతం డే మాట్లాడుతూ.. నానో పార్టికల్స్‌లో సూపర్ హైడ్రోఫోబిక్ పని సామర్థ్యాన్ని వివరించారు. దీనికి జారుడు స్వభావం ఉంటుందన్నారు. నీటిబొట్టు ఏ వస్తువు మీదనైతే నిలువదో అది సూపర్ హైడ్రోఫోబిక్ స్వభావాన్ని కలిగి ఉంటుందన్నారు. ఉదాహరణకు తామరాకు, బల్లి తల భాగంపైన నీటి బొట్టు నిలువదన్నారు. ఇవి పార్టికల్స్‌తో మమేకమవుతాయన్నారు. అందుకే సోలార్ పానల్స్లో దుమ్మూధూళి నిలువకుండా ఉండడానికి ఈ సూపర్ హైడ్రోఫోబిక్ ఉపయోగిస్తారని తెలిపారు. దీంతో వాటి పని సా మర్థ్యం మెరుగవుతుందన్నారు. 2018లో సూపర్‌హైడ్రోఫోబిక్ మానిటర్ కనుక్కున్నట్లు తెలిపారు. ఈ టెక్నాలజీలో ఉపయోగాలు ఎక్కువ ఉంటాయన్నారు.అంతరిక్షంలో కూడా సూపర్ హైడ్రోఫోబిక్ ఉపయోగించడంతో త్వరగా పాడు కాకుండా, మచ్చలు పడకుండా మన్నికగా ఉంటుందన్నారు. వీటన్నింటినీ తయారుచేసి సమాజానికి అందిస్తూ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారన్నారు. సూపర్ హైడ్రోఫోబిక్లో యంగ్ స్టేట్ కాన్సెప్ట్, వెన్జెల్ స్టేట్ కాన్సెప్ట్, కాలిబ్యాటర్స్ స్టేట్ కాన్సెప్ట్, లాప్లెస్ ఫ్రెషర్ కాన్సెప్ట్ గురించి వివరించారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని పెడీట్రిక్స్ విభాగానికి చెందిన రీసెర్చ్ అసోసియేట్ డాక్టర్ రష్మీ యాదవ్ మాట్లాడుతూ యోగాసనాలు, వాటి ప్రభావం గురించి తెలిపారు. ఓం జపించడం ద్వారా బ్రహ్మ యోగంలో కలిగే మార్పులను వివరించారు. అధిక రక్తపోటు, స్థూలకాయం ఉన్న వ్యక్తుల్లో బ్రహ్మయోగం, ఓం చాంటింగ్ ప్రాధాన్యాన్ని తెలిపారు.
మధ్యాహ్నం సెషన్లో ..
మధ్యాహ్నం సెషన్లో కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ నుంచి ప్రొఫెసర్ అచ్చ్య, ప్రొఫెసర్ వీరబ్రహ్మం, ఐఐసీటీ హైదరాబాద్ నుంచి డాక్టర్ ఎన్.లింగయ్య మెటీరియల్ సైన్స్‌పై మాట్లాడారు. సమాంతర సాంకేతిక సమావేశంలో అల్ట్రాసోనిక్స్లో జేపీఏయూ చీఫ్ ఎడిటర్ డాక్టర్ ఎస్కె.జైన్, ఉత్తరప్రదేశ్ వీబీఎస్ పూర్వాంచల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజేంద్రసింగ్ (రజ్జుభయ్యా) ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ ఫర్ స్టడీ అండ్ రీసెర్చ్‌లోని ఫిజిక్స్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రామన్షు, పి.సింగ్, ట్రికీలోని సెయింట్ జోసెఫ్స్ కాలేజీ ఫిజిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఐ.జాన్సర్, న్యూఢిల్లీలోని అల్ట్రాసోనిక్ సెక్షన్ సీఎస్ఐఆర్ నేషనల్ ఫిజికల్ లాబోరేటరీస్ డాక్టర్ యుదిష్టర్ కుమార్ యాదవ్, హైదరాబాద్‌కు చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి నానో టెక్నాలజీపై మాట్లాడారు. అనంతరం పోస్టర్/ఓరల్ ప్రదర్శనలు నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో ఉపకులపతి రవీందర్‌గుప్తా, రిజిస్ట్రార్ శివశంకర్, ప్రిన్సిపాల్ ఆరతి, డాక్టర్ వి. త్రివేణి పాల్గొన్నారు.