వేల్పూర్, జూలై 30: తొలిమెట్టుతో గుణాత్మక విద్యను విద్యార్థులకు అందించాలని మండల విద్యాధికారిణి వనజారెడ్డి అన్నారు. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు మూడు రోజుల శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మొదటిరోజు ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కనీస అభ్యసన సామర్థ్యాలతో పాటు ఆ తరగతితో చెందిన అభ్యసన ఫలితాలు సాధించినప్పుడే గుణాత్మక విద్య అందుతుందన్నారు. కార్యక్రమంలో మండల మానిటరింగ్ ఆఫీసర్ లింగన్న, రిసోర్స్పర్సన్లు సయ్యద్ బాసీద్, అంకం నరేశ్, ప్రశాంత్, శ్రావణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బాల్కొండలో..
బాల్కొండ, జూలై 30 : మండల కేంద్రంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని బాల్కొండ, మెండోరా, ముప్కాల్ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో బట్టు రాజేశ్వర్ తెలిపారు. జిల్లా రిసోర్స్పర్సన్లుగా నర్సారెడ్డి, రవికుమార్, బోయడ నర్సయ్య, నటరాజ్ మొదటి విడుతలో తొలి మెట్టుపై శిక్షణను ఇవ్వనున్నారని తెలిపారు. కార్యక్రమంలో నోడల్ అధికారి సుదర్శన్‌చారి, సీఆర్పీ ప్రభాకర్, సతీశ్, రజిని, సుమలత పాల్గొన్నారు.
భీమ్‌గల్‌లో…
భీమ్‌గల్, జూలై 30 : పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని ఎంఈవో స్వామి ప్రారంభించారు. ప్రాథమిక విద్య చదువుతున్న విద్యార్థులకు కనీస సామర్థ్యాలు వచ్చేలా ప్రతి ఉపాధ్యాయుడూ కృషి చేయాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన చేయాలన్నారు. మండల నోడల్ అధికారి జె.శంకర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు హరినాథ రఘువాస్, ఉపాధ్యాయులు వాసుదేవ్, దయాకర్, లక్ష్మీనారాయణ, ఆర్పీలు శేఖర్, మెండి ప్రభాకర్, పి.నవీన్‌కుమార్, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం
రుద్రూర్, జూలై30: మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో ఎంఈవో శాంత కుమారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభించారు. నాలుగు మండలాల నుంచి 45 మంది ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయురాలు మంజూష శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఆర్మూర్‌లో ..
ఆర్మూర్, జూలై 30: ఆర్మూర్‌లోని మండల విద్యావనరుల కేంద్రంలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు తొలి మెట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. రిసోర్స్పర్సన్లుగా రవీందర్, శ్యాంసుందర్, రాకేశ్, శ్రావణి శిక్షణ ఇచ్చారు. మండలానికి నోడల్ ఆఫీసర్‌గా ఎంపికైన వెంకటనర్సయ్యను ఎంఆర్సీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఎంఈవో పింజ రాజగంగారాం పాల్గొన్నారు.
కనీస సామర్థ్యం పెంపొందించాలి
ధర్పల్లి, జూలై 30: విద్యార్థుల్లో కనీస సామర్థ్యం పెంపుదలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు శిక్షణ నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీలో ఉపాధ్యాయులకు మూడు రోజులశిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రిసోర్స్‌పర్సన్ శ్రీధర్, రవికుమార్, ప్రసన్నకుమార్, శ్రీధర పాల్గొన్నారు.