బిచ్కుంద, జూలై 30 : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్యచేయించింది భార్య. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్‌డాటా ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన బిచ్చుంద మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ కృష్ణ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బిచ్కుంద మండల కేంద్రంలోని ఓ కాలనీలో భార్యభర్తలైన హన్మాబోయి (30), అనురాధ నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అదే కాలనీకి చెందిన పోశాబోయితో అనురాధ వివాహేతర సంబంధం పెట్టుకుంది. వివాహేతర సంబంధానికి తన భర్త అడ్డువస్తున్నాడని, అడ్డుతొలగించుకోవడానికి అనురాధ పథకం రచించింది. ఈ విషయం పోశాబోయికి తెలిపింది. దీంతో పోశాబోయి, తన మిత్రుడు రమేశ్ కలిసి హన్మాబోయిని దౌల్తాపూర్ అటవీ ప్రాంతంలోకి బుధవారం రాత్రి తీసుకెళ్లి మద్యం తాగారు. మత్తులోకి వెళ్లగానే హన్మాబోయి గొంతుకు తాడు బిగించి హత్యచేసి, అనురాధకు విషయం చెప్పారు. అనంతరం అనురాధ, పోశాబోయి, రమేశ్ ముగ్గురు కలిసి బాన్సువాడకు వెళ్లి బం ధువుల వద్ద ఒక రోజు ఉండి మరుసటి రోజు గురువారం బిచ్కుందకు వచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేపట్టారు. మృతుడి సెల్‌ఫోన్ కాల్ డాటా ఆధారంగా నిందితులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కృష్ణ, ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపారు. కేవలం నాలుగురోజుల్లో కేసును ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.