బీర్కూర్, జూలై 28: దళితుల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అ న్నారు. బాన్సువాడ మండలం బోర్లం క్యాంపు గ్రామానికి చెందిన లబ్ధిదారుడికి దళిత బంధు యూ నిట్ కింద కారు మంజూరుకాగా, స్పీకర్ తన నివాసం వద్ద కారు తాళం చెవిని గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకాన్ని చూసి ప్రతి రాష్ట్రంలోని దళితులు తామెందుకు తెలంగాణ రాష్ట్రంలో పుట్టలేదా అని నిరాశ పడుతున్నారని అన్నారు. దళితులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని దళితులందరికీ దళిత బంధు పథకం కచ్చితంగా అందుతుందని చెప్పారు. దళితులు ప్రభుత్వానికి అండగా నిలువాలని కోరారు.
82 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
బాన్సువాడ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 82 మందికి సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సాయం మంజూరుకాగా, సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గు రువారం అందజేశారు. బాన్సువాడలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చెక్కు ల పంపిణీ అనంతరం ప్రజాప్రతినిధులు, నాయకులతో మాట్లాడారు. సమైక్యపాలనలో తెలంగాణ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులంటే ఏ కొద్దిమందికో తెలిసేదని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయ నిధిపై అవగాహన కలిగిందన్నారు.
సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎంతో మంది ప్రాణాలతో బయటపడ్డారన్నారు. వారికి అప్పుల బాధలు తొలగిపోయాయన్నారు. ప్రైవేటు దవాఖానాల్లో చికిత్స పొందిన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులని, దీని గురించి సమైక్య పాలకులు తెలంగాణ ప్రజలకు తెలియనిచ్చేవారు కాదన్నారు. ఒకవేళ అరకొర మందికి తెలిసినా ఈ పథకం ద్వారా నిధులు తెలంగాణ ప్రాంతానికి ఇచ్చేవారు కాదన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, ఎంపీపీ విఠల్, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు గోపాల్‌రెడ్డి, ప్రతాప్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
బాన్సువాడ టౌన్, జూలై 28: బాన్సువాడ పట్టణ పరిధిలోని పాత బాన్సువాడ పెద్ద హనుమాన్ మందిరం సమీపంలో రూ.75 లక్షలతో చేపట్టిన కల్యాణ మండప నిర్మాణ పనులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. సమీపంలో వృథాగా ఉన్న ప్రదేశంలో పార్కు ఏర్పాటు చేయాలని రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, తన వ్యక్తిగత సహాయకుడు భగవాన్రెడ్డికి సూచించారు. స్పీకర్ వెంట టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి, కౌన్సిలర్ గదుమల లింగమేశ్వర్, కౌన్సిలర్లు రవీందర్ రెడ్డి, నర్సగొండ, నాయకులు దాసరి శ్రీనివాస్, ఏ. వెంకట్ రెడ్డి, విఠల్ రెడ్డి, మట్ట సాయిలు, మహేశ్, వీరారెడ్డి తదితరులు ఉన్నారు.