కమ్మర్పల్లి, జూలై 8 : ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ సొసైటీలో అక్రమాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులకు నష్టపరిహారాన్ని అందించేందుకు సహకార సంఘానికి చెందిన స్థిరాస్తులను అమ్మకానికి పెట్టారు. ఆస్తులను ఈ నెల 18న వేలం వేయనున్నట్లు జిల్లా సహకార శాఖ అధికారి సింహాచలం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాళ్ల రాంపూర్, గుమ్మిర్యాల్, దోంచంద, తడ్పాకల్ గ్రామాల్లో సొసైటీకి ఆస్తులు ఉన్నాయని తెలిపారు. వాటి పూర్తి వివరాలు, వేలం నియమ నిబంధనలు జిల్లా సహకార శాఖ అధికారి కార్యాలయంలో లభిస్తాయని పేర్కొన్నారు. కొటేషన్లు వేసేందుకు ఆసక్తి ఉన్నవారు మరిన్ని వివరాల కోసం 9100115747 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ నెల 16వ తేదీలోగా కేవైసీ- డాక్యుమెంట్లు, ఈఎండీ, డిపాజిట్ రుసుముతో రిజిష్ర్టేషన్ చేసుకోవాలని సూచించారు. 18న ఉదయం 10 గంటలకు వేలం నిర్వహిస్తామని, 19 నుంచి 21వ తేదీ వరకు లాట్ల బట్వాడా ఉంటుందని వివరించారు.