ఇందూరు, జూలై 8 : నగరంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న బాలసదన్‌లో 40 మంది అనాథ బాలలకు అవసరమయ్యే సామగ్రిని జోయాలుక్కాస్ ఫౌండేషన్ ప్రతినిధులు శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై సామగ్రిని బాలలకు అందజేసి మాట్లాడారు. సుమారు రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే బెడ్లు, దుప్పట్లు, దిండ్లు, ట్రంకుపెట్టెలు, యూనిఫామ్, షూస్, స్కూల్ బ్యాగులు, కాస్మోటిక్స్, ఎత్తు, బరువును కొలిచే యంత్రాలు తదితర సామగ్రిని అందజేసిన జోయాలుక్కాస్ ఫౌండేషన్ ప్రతినిధులను అభినందించారు. బాలలకు అవసరమయ్యే వస్తువులను గుర్తించి వాటిని అందజేయడం గొప్పవిషయమన్నారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారిణి ఝాన్సీలక్ష్మి, చైతన్య కులకర్ణి, కిర్ణ, జిల్లా జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, జోయాలుక్కాస్ ప్రాంతీయమేనేజర్ రాబిన్ తంబీ, స్థానిక మేనేజర్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.