నిజామాబాద్ క్రైం, జూలై 2 : నిజామాబాద్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ సౌత్ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని శనివారం తనిఖీ చేశారు. సౌత్ రూరల్ సీఐ జె.నరేశ్ సంబంధిత ఎస్సైలతో సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, వారు ఇచ్చే దరఖాస్తులపై విచారణ చేపట్టి సత్వరం పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఏసీపీ సూచించారు.
సర్కిల్ పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలపాలను నియంత్రించేందుకు రాత్రి, పగలు పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహించాలన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వారిని సంబంధిత స్టేషన్కు తీసుకువెళ్లి పూర్తి స్థాయిలో విచారణ చేయాలన్నారు. మట్కా, గుట్కా, పేకాట ఇతర అసాంఘిన కార్యకలాపాలను అదుపు చేసేందుకు పటిష్టమైన నిఘా పెట్టాలని ఏసీపీ వెంకటేశ్వర్ సూచించారు. సమావేశంలో రూరల్ ఎస్సై లింబాద్రి, ఆరో టౌన్ ఎస్సై సాయికుమార్, మోపాల్ ఎస్సై మహేశ్ పాల్గొన్నారు.