మోర్తాడ్, జూన్16: వానకాలం తరువాత పెద్దవాగులో చెక్‌డ్యాం నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మోర్తాడ్ అభివృద్ధికి రూ.11 కోట్లు మంజూరు చేయించనున్నట్లు చెప్పారు. మోర్తాడ్‌లో రూ.4.50కోట్లతో ఏర్పాటు చేయనున్న సెంట్రల్‌లైటింగ్ పనులకు గురువారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మంజూరైన సెంట్రల్ లైటింగ్ పనులే కాకుండా జాతీయ రహదారిపై తహసీల్ కార్యాలయం నుంచి పాలెం రోడ్డు వరకు సెంట్రల్‌లైటింగ్ కోసం రూ.3.50లక్షలు, గాండ్లపేట్ వద్ద మరో బ్రిడ్జి నిర్మాణానికి మరో మూడు కోట్లు మంజూరు చేయిస్తానని అన్నారు. ఇప్పటికే భీమ్‌గల్‌లో వంద పడకల దవాఖాన కోసం రూ.35కోట్లు, పెద్దవాగుపై ఏడు చెక్‌డ్యాముల నిర్మాణనికి రూ.57కోట్లు సీఎం మంజూరు చేశారని తెలిపారు. ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలుంటే బాల్కొం డ నియోజకవర్గాన్ని ఆదర్శనియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందామన్నారు.
ఘన స్వాగతం.. గజమాలతో సత్కారం
సెంట్రల్‌లైటింగ్ పనులకు శంకుస్థాపన కోసం వచ్చిన మంత్రి ప్రశాంత్‌రెడ్డికి మోర్తాడ్‌లో ఘనస్వాగతం లభించింది. మహిళలు మంగళహారతులతో ముందుండగా వలగొడుగు, కాగితపుపూల వర్షంతో ప్రజలు స్వాగతం పలికారు. మంత్రికి క్రేన్ సహాయంతో ఎంపీపీ శివలింగుశ్రీనివాస్, సర్పంచ్ ధరణి ఆనంద్ గజమాలతో సన్మానించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలి యా, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పర్సదేవన్న, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ పాపాయి పవన్, సొసైటీ చైర్మన్ కల్లెం అశోక్, డీసీసీబీ డైరెక్టర్ మోత్కుభూమన్న, ఎంపీటీసీ రాజ్‌పాల్, కో-ఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్, సొసైటీ ఉపాధ్యక్షుడు దడివె నవీన్, ఉపసర్పంచ్ చొక్కా యి గం గారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ జేసీ గంగారెడ్డి, మార్కెట్‌కమిటీ డైరెక్టర్ రాజేశ్వర్, రమే శ్, మహిపాల్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.