ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆదివారం ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 38,205 మంది అభ్యర్థులకు గాను 35,938 మంది హాజరు కాగా, 2267 మంది గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన పేపర్ -1 పరీక్షను 92 కేంద్రాల్లో నిర్వహించగా 21,810 మందికి గాను 20516 మంది హాజరు కాగా 1285 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్-2 పరీక్షను 71 కేంద్రాల్లో నిర్వహించగా 16,395 మందికి గాను 15,422 మంది హాజరు కాగా 973 మంది గైర్హాజరయ్యారు.

