లింగంపేట్, జూన్11: మండల కేంద్రంలో నిర్మించిన ఎల్లమ్మ ఆలయానికి హైకోర్టు న్యాయవాది మొయిన్ అహ్మద్ ఖాద్రీ రూ.8 లక్షల విరాళాన్ని అందించారు. నూతనంగా నిర్మించిన ఆలయానికి రూ.5 లక్షలు ఇటీవల అందజేశారు. ఆలయ ఆవరణలో వంటశాల నిర్మాణానికి మరో రూ.3లక్షలు విరాళాన్ని శనివారం అందించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు న్యాయవాది దంపతులను ఆలయానికి ఆహ్వానించి శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు రవీందర్‌గౌడ్, రాజాగౌడ్, మనోహర్‌గౌడ్, లక్ష్మీనారాయణగౌడ్, సిద్దాగౌడ్, శంకర్‌గౌడ్ పాల్గొన్నారు.