బాన్సువాడ టౌన్, జూన్ 9 : దళితుల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలుచేశారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని 15వ వార్డుకు చెందిన దళితుబంధు లబ్ధిదారుడు గైని భాస్కర్‌కు ఎర్టిగా కారును స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం రాత్రి అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతి కోసం మన రాష్ట్రంలో తప్ప ఎక్కడా ఇలాంటి పథకం లేదన్నారు. దళితబంధు లబ్ధిదారులు యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. ఈ విడుతలో ఎంపిక కాని వారు నిరాశ చెందవద్దని, అర్హులందరికీ విడుతల వారీగా యూనిట్లను అందజేస్తామని చెప్పారు.
డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి లబ్ధిదారుడికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, బుడ్మి సొసైటీ చైర్మన్ పిట్ల శ్రీధర్, మాజీ ఎంపీపీ ఎజాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, కో-ఆప్షన్ సభ్యుడు అలీమొద్దీన్ బాబా, స్పీకర్ పీఏ భగవాన్‌రెడ్డి, నాయకులు గోపాల్ రెడ్డి, వాహబ్, నార్ల ఉదయ్, రమేశ్, విఠల్‌రెడ్డి, ఆమేర్, కౌన్సిలర్ బాడి శ్రీనివాస్ పాల్గొన్నారు.