కమ్మర్పల్లి/ఆర్మూర్, జూన్ 8 : పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమంలో బుధవారం జిల్లాలో ప్రారంభమైంది. జక్రాన్‌పల్లిలో వైస్ ఎంపీపీ తిరుపతిరెడ్డి నట్టల నివారణ మందు పంపిణీని ప్రారంభించారు. పశువైద్యాధికారి కృష్ణ, సర్పంచులు చిన్న సాయారెడ్డి, మోహన్ నాయక్, పశువైద్య సిబ్బంది అశోక్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్లో జడ్పీటీసీ నారోజి గంగారాం జీవాలకు నట్టల నివారణ మందు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశువైద్యుడు సంతోష్, సిబ్బంది సాయి, బాపూజీలింగం పాల్గొన్నారు. ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో వైస్ ఎంపీపీ బూసాని అంజయ్య, సర్పంచ్ నోముల విజయలక్ష్మి, పశువైద్యాధికారి గంగప్రసాద్ నట్టల నివారణ మందు పంపిణీని ప్రారంభించారు.
సిరికొండలో పశువైద్యాధికారి బాబురావు, సర్పంచ్ ఎన్నం రాజిరెడ్డి, మోపాల్ మండలం కులాస్‌పూర్‌లో సర్పంచ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జావెద్, చిత్రసాయి, మహేందర్, కుమారస్వామి, పోశెట్టి పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్‌లో సర్పంచ్ ఏనుగు పద్మ ఆధ్వర్యంలో పశువైద్యాధికారి రాజశేఖర్‌రావు 2,277 గొర్రెలు, 244 మేకలకు నట్టల నివారణ మందు వేశారు. ఉపసర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, ఎంపీటీసీ నోముల రజిత, రైతుబంధు సమితి గ్రామ కో-ఆర్డినేటర్ నోముల నరేందర్, వెటర్నరీ సిబ్బంది ప్రవీణ్‌రెడ్డి, జమిల్, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని మగ్గిడి గ్రామంలో జీవాలకు నట్టల నివారణ మందును బుధవారం వేశారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచులు సుద్దపల్లి సుమలత, సుద్దపల్లి నర్సయ్య, మండల వైద్యాధికారి లక్కం ప్రభాకర్, పశు వైద్యాధికారిణి శైలజ, వైద్యసిబ్బంది, జీవాల పెంపకందారులు పాల్గొన్నారు.