ఖలీల్‌వాడి, జూన్ 6 : పట్టణ ప్రగతిలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. నగరంలోని 50వ డివిజన్ పరిధిలో ఉన్న శివాజీనగర్‌లో సోమవారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా శిథిలావస్థలో ఉన్న భవనాలు, విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నామని తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి వాటిని సురక్షిత ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నామని, పిచ్చిమొక్కలు, మట్టి కుప్పలను తొలగిస్తున్నామన్నారు. స్పెషల్ టీములతో అన్ని డివిజన్లలో శానిటేషన్ పనులు నిర్వహిస్తున్నామన్నారు. వానకాలం ప్రారంభమవుతున్నందున మురుగునీరు నిల్వకుండా డ్రైనేజీలు, డీ-సిల్టేషన్ చేస్తున్నామని తెలిపారు.
నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సెంటర్ మీడియన్, ప్రతి డివిజన్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచామన్నారు. నగరవాసులకు ఇబ్బందులు లేకుండా ప్రతిరోజూ మంచినీరు సరఫరా చేస్తున్నామన్నారు. అభివృద్ధి పనులు చేపడుతుండడంతోపాటు సమస్య తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించి ప్రతిరోజూ నగర ప్రజలకు మంచినీరు అందిస్తున్నామన్నారు. అభివృద్ధి పనులతో పాటు కరోనా విపత్కర పరిస్థి తుల్లో ఎన్నో సేవలందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ దండు నీతూకిరణ్, కార్పొరేటర్ బట్టు రాఘవేందర్, టీఆర్ఎస్ నాయకులు సుజిత్‌సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, డివిజన్ నాయకులు మాతంగి సదానంద్, నరేందర్, మున్సిపల్ కమిషనర్ చిత్రామిశ్రా, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు అధికారులు పాల్గొన్నారు.
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి
భీమ్‌గల్, జూన్ 6: పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలతా సురేందర్ అన్నారు. 4వ విడుత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం 5వ వార్డులో కౌన్సిలర్ బొదిరె నర్సయ్యతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వార్డు మహిళలతో మాట్లాడుతూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని తడి, పొడి చెత్తలను వేర్వేరుగా మున్సిపల్ వాహనాల్లో వేయాలన్నారు. అనంతరం యువకులు మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సీహెచ్.గంగాధర్, ధరావత్ లింగయ్య, వార్డు స్పెషల్ ఆఫీసర్ మహిళలు, యువకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆర్థికాభ్యున్నతి కోసమే ‘దళితబంధు’
ఖలీల్‌వాడి, జూన్ 6 : సీఎం కేసీఆర్ దళితుల ఆర్థికాభ్యున్నతి కోసమే దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. దళితబంధు పథకం లబ్ధిదారు నగరంలో ఏర్పాటు చేసిన ఆటోమొబైల్ షాప్‌ను సోమవారం ప్రారంభించి నిర్వాహకుడు శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, కార్పొరేటర్లు బైకాన్ సుధామధు, కంపల్లి ఉమారాణి ముత్యాలు, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు నీలగిరి రాజు, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.