ఆర్మూర్/బోధన్/మాక్లూర్, మే 27: నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని, ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సీపీఐ నాయకలు ఆరెపల్లి సాయిలు, సీపీఎం నాయకుడు పి.వెంకటేశ్, న్యూడెమోక్రసీ నాయకుడు దాసు, సీపీఐఎంఎల్ నాయకుడు సుధాకర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలపై తీవ్రమైన భారం పడుతోందన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు యాదగిరి, మౌలానా, బాలయ్య, ఎల్లయ్య, భూమన్న, రాజు, సూర్యశివాజీ పాల్గొన్నారు. సీపీఐఎంఎల్ ప్రజాపంథా ఆర్మూర్ సబ్‌డివిజన్ కమిటీ నాయకులు పట్టణంలో ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రజాపంథా పార్టీ నాయకుడు దేవరాం మాట్లాడుతూ పెంచిన ధరలను నిరసిస్తూ ఈనె30న జిల్లా కేంద్రంలో ధర్నాలు, 31న హైదరాబాద్‌లో ఇందిరా పార్కు వద్ద ఆందోళనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో సీపీఐఎంఎల్ ప్రజాపంథా పార్టీ ఆర్మూర్ సబ్‌డివిజన్ నాయకులు సుమన్, ఏపీ గంగారాం, రాజన్న, శేఖర్, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు కిషన్, పీవోడబ్ల్యూ నాయకులు పద్మ, లక్ష్మి, సునీత, నాయకులు అరవింద్, నజీర్, మనోజ్, పీడీఎస్‌యూ అధ్యక్షుడు నరేందర్, అనిల్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా బోధన్ డివిజన్ కార్యదర్శి బి.మల్లేశ్ మాట్లాడారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పలు పార్టీల నాయకులు షేక్ బాబు, జె.శంకర్ గౌడ్, పుట్ట వరదయ్య, రాజ్‌పాల్, డి.పోశెట్టి, పడాల శంకర్ తదితరులు పాల్గొన్నారు. మాక్లూర్ తహసీల్ కార్యాలయంలో గిర్ధావర్ షఫీకి సీపీఐ మండల ఇన్చార్జి రాజన్న, నాయకులు వినతి పత్రం అందజేశారు. సాయిలు, వెంకటేశ్వర్రావు, మేకల సాయిలు పాల్గొన్నారు.