నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఫిబ్రవరి 27: జిల్లావ్యాప్తంగా పల్స్‌పోలియో కార్యక్రమం ఆదివారం ప్రారంభమయ్యింది. ఆయా గ్రామ పంచాయతీల్లో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ప్రజా ప్రతినిధులు, వైద్యాధికారులు ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు చిన్నారులకు తప్పకుండా టీకాలు వేయించాలని ఈ సందర్భంగా వారు సూచించారు. నవీపేటలోని పల్స్‌పోలియో కేంద్రాలను వైద్యశాఖ రాష్ట్ర పరిశీలకుడు రాములు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 1.87లక్షల మంది ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలను వేస్తామని తెలిపారు. పోలియో చుక్కలను వేయడంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు.