మెండోరా, మే 10 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశానికే తెలం గాణ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. మెం డోరా మం డలం దూస్‌గాం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, యువకులు మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. బీఎస్పీ నాయకుడు గోపి ఆధ్వర్యంలో వంద మంది టీఆర్ఎస్లో చేరారు. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్‌తో కలిసి పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జనరంజకపాలన నచ్చి ఇతర పార్టీలకు చెందిన వారు టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి కళ్లముందే కనిపిస్తున్నా, కొందరు సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, దీనిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టా ల్లో లేవన్నారు. మోదీకి భయపడి పక్క రాష్ట్రమైన ఏపీలో విద్యుత్ మోటర్లకు మీటర్లు పెడుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఏది ఏమైనా తెలంగాణ రైతుల ప్రయోజనాలే ముఖ్యమని, మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని కేంద్రానికి తెగేసి చెప్పారని అన్నారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో మెండోరా మండలం దూస్‌గాం గ్రామానికి చెందిన బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు, బుస్సాపూర్ సొసైటీ డైరెక్టర్ అయిలి నరేశ్, అనుచరులు 25 మంది మల్లేశ్, సరికెల సంజయ్, మురళి, మతిన్ఖాన్, విజయ్, హరీశ్, ప్రదీప్, చినబాబు, జ్ఞాని, రాజు, సుభాష్, ప్రశాంత్, దిలీప్, రాకేశ్, దేసు అక్షయ్, రాము, శ్రీకాంత్, అశ్వంత్ ఉన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, డీసీసీబీ డైరెక్టర్ శేఖర్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు రాజేందర్, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ దేవేందర్, మాజీ ఎంపీపీ రాజారెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ బాబా, జి.శ్రీనివాస్, అ శోక్, గోపి, అక్తర్, అశోక్, చిట్టి వేంపల్లి పాల్గొన్నారు.