బీర్కూర్/ఎల్లారెడ్డి రూరల్, ఏప్రిల్ 12 : కాంగ్రెస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. మేమంటే మేమంటూ పోటాపోటీగా నిరసనలకు దిగడమే కాకుండా బహిరంగంగానే ఒకరిపై ఒకరు వ్యతిరేక నినాదాలు చేయడంతో స్థానికులు విస్త్తుపోతున్నారు. మంగళవారం బా న్సువాడ, ఎల్లారెడ్డిలో చోటు చేసుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శనంగా ని లుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టా నం ఇచ్చిన పిలుపు మేరకు ధాన్యం కొ నుగోలు చేయాలంటూ నియోజకవర్గ కేంద్రాల్లో మంగళవారం ధర్నా కార్యక్రమాలను నిర్వహించారు. బాన్సువా డ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఒక వర్గం వారు .. రాజీవ్ గాంధీ చౌరస్తాలో మరో వర్గం వారు ధర్నా చేపట్టారు. ఒకే పార్టీకి చెందిన వారు రెండు ప్రాంతాల్లో ధర్నాలు చేయడం ఏమిటని.. చూసిన వారు ముక్కున వేలేసుకున్నారు. ఇన్ని రోజులు అంతర్గతం గా ఉన్న కుమ్ములాటలు మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమాలతో బహిర్గతమయ్యాయి.
ఎల్లారెడ్డిలో మరోసారి..
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షలో మరోసారి వర్గపోరు బట్టబయలైంది. ఆ పార్టీ నేత లు చేపట్టిన నిరసన దీక్ష రసాభాసగా మారింది. ఎల్లారెడ్డిలోని తహసీల్ కార్యాలయం వద్ద ఉన్న తెలంగాణ తల్లి ప్రాంగణంలో పార్టీ నియోజవకర్గ కో-ఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు ఉదయం ప్రా రంభించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు మొదటగా దీక్షలో పాల్గొన్నారు. రెండు గంటల దీక్ష అనంతరం సుభాష్‌రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. తరువాత కొద్ది సేపటికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మదన్మోహన్ తన అనుచరులతో కలిసివచ్చి మరోసారి తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. దీంతో అక్కడే శిబిరంలో ఉన్న సుభాష్‌రెడ్డి వర్గీయులు, మదన్మోహన్ వర్గీయులు పరస్పరం తోసుకుంటూ, వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. దీంతో పోలీసులు కల్పించుకొని కార్యకర్తలను చెదరగొట్టారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. స్థానిక సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు మ దన్మోహన్ వర్గం నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది లేకుండా దూ రంగా పంపించారు.