వేల్పూర్, ఏప్రిల్ 8 : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో ఉద్యోగార్థులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు,హౌసింగ్,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఉచిత శిక్షణ అందివ్వనున్నారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి గ్రూప్-2, 3,4, పోలీస్(ఫిజికల్ ట్రైనింగ్ మినహా) ఉద్యోగాల పోటీ పరీక్షలకు కోసం తన సొంత ఖర్చులతో వేల్పూర్ మండలంలోని హనుమాన్ నగర్(పడగల్ వడ్డెర కాలనీ) గ్రామ సమీపంలో కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుండగా, ఇందుకు సంబంధించిన పనులను మంత్రి శుక్రవారం పరిశీలించారు. సెంటర్‌కు వచ్చే వారికి తాగు నీటి వసతి, ఫ్యాన్లు ఏర్పాటు చేయించాలని స్థానిక నాయకులను ఆదేశించారు. సుమారు మూడు నెలల పాటు నిర్వహించే ఉచిత కోచింగ్ సెంటర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ప్రతి రోజు మధ్యాహ్నం రుచికరమైన భోజనం అందించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. నియోజకవర్గంలోని ఉద్యోగార్థులు ఉచిత కోచింగ్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకొవాలని మంత్రి కోరారు. మంత్రి వెంట ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, పార్టీ మండల కన్వీనర్ నాగధర్,మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు కేతన్, నందిపేట్ ప్రవీణ్,భీమ ప్రసాద్ తదితరులు ఉన్నారు.