నిజామాబాద్ రూరల్, ఆగస్టు 13 : నిజామాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 56 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరయ్యాయి. రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్.. ఎంపీపీ బానోత్ అనూషా ప్రేమ్‌దాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్రావులతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషిచేస్తున్నదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతోపాటు ప్రతి వస్తువుపై జీఎస్టీ విధించడంపై మధ్యతరగతి కుటుంబీకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజా, రైతు వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ అనిల్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ రంజిత్, గిర్దావర్ హరీశ్‌రెడ్డి, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, కేసీఆర్ సేవాదళ్ రూరల్ సెగ్మెంట్ కన్వీనర్ కోర్వ దేవేందర్, సర్పంచులు లక్ష్మణ్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, అశోక్, జలంధర్‌గౌడ్, లావణ్యాప్రవీన్, సొసైటీ చైర్మన్ శ్రీధర్, కార్పొరేటర్లు కోర్వ లలితా గంగాధర్, శ్రీనివాస్‌రెడ్డి, యమునా అనిల్, ఎంపీటీసీ సభ్యుడు గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు మోహన్, అక్బర్, గోపాల్‌నాయక్, పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
డిచ్పల్లి/ వర్ని, ఆగస్టు 13: జక్రాన్‌పల్లి మండలం నారాయణపేట గ్రామానికి చెందిన గాజుల భాస్కర్ కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 2 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది. ఇందుకు సంబంధించిన చెక్కును బాధిత కుటుంబానికి చెక్కును ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు జగన్ శనివారం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కుంచాల విమలారాజు, సర్పంచ్ రబ్బ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
వర్ని మండలం కూనిపూర్ గ్రామానికి చెందిన దత్తాగౌడ్కు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 30 వేల చెక్కు మంజూరైంది. లబ్ధిదారుడికి సర్పంచ్ శశికళ చెక్కును శనివారం అందజేశారు. కార్యక్రమంలో జాకోరా సహకార సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నాయకులు కల్లాలి గిరి, రమేశ్ గౌడ్, ప్రభాకర్, సాయాగౌడ్, బాలయ్య, బంజ శంకర్ తదితరులు పాల్గొన్నారు.