వినాయక్‌నగర్, ఫిబ్రవరి 21 : నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ మఫ్టీలో మంగళవారం అర్ధరాత్రి నగరంలో తనిఖీలు చేపట్టారు. రాత్రివేళ సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో తెలుసుకున్నారు. అర్ధరాత్రి హోటళ్లు, పాన్ కోకాలు, టీ స్టాళ్లు తెరిచిఉండడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.