వేతన బకాయిలు చెల్లించాలి
నిజాం షుగర్స్‌కు లేఆఫ్ ప్రకటించి 11 ఏండ్లు గడుస్తున్నప్పటికీ, తమకు న్యాయంగా రావాల్సిన వేతన బకాయిలు చెల్లించకపోవడంపై కార్మికులు నిరసన వ్యక్తంచేశారు. బుధవారం శక్కర్‌నగర్‌లోని నిజాం షుగర్స్ మెయిన్ గేట్ వద్ద కార్మికులు ధర్నా చేశారు. తమను ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, వెంటనే తమకు రావాల్సిన వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్‌చేశారు.
- నిజాం షుగర్స్‌ను తెరిపించాలి
- ఫ్యాక్టరీ ప్రధాన గేట్ ఎదుట కార్మికుల ధర్నా
బోధన్, మే 3: నిజాం షుగర్స్‌కు లేఆఫ్ ప్రకటించి 11 ఏండ్లు గడుస్తున్నప్పటికీ, తమకు న్యాయంగా రావాల్సిన వేతన బకాయిలు చెల్లించకపోవడంపై కార్మికులు నిరసన వ్యక్తంచేశారు. బుధవారం శక్కర్‌నగర్‌లోని నిజాం షుగర్స్ మెయిన్ గేట్ వద్ద కార్మికులు ధర్నా చేశారు. తమను ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, వెంటనే తమకు రావాల్సిన వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్‌చేశారు. నిజాం షుగర్స్‌ను తాము అధికారంలోకి వస్తే పునరుద్ధరిస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు.
కార్మిక చట్టాల ప్రకారం వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు రోడ్డున పడ్డారని, తమ బకాయిలు రాకముందే కొందరు మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి అనేకసార్లు తమ సమస్యలు తీసుకెళ్లామని, ఇప్పటివరకు స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ధర్నాలో కార్మిక సంఘాల నాయకులు నాగుల రవిశంకర్‌గౌడ్, ఉపేందర్, బాలకృష్ణ, రాజారాం, దేవదాసు, కార్మికులు బాలచందర్, భాస్కర్, భిక్షపతి, భూమయ్య, శ్రీధర్ పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

