NEET UG exam | వినాయక్ నగర్, జూన్ 12 : నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 21న రీ-ఎగ్జామినేషన్ ఆఫ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, నీట్ యూజీ-2026 నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి ఎస్పీ, నిజామాబాద్ ఇన్చార్జి సీపీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎగ్జామ్ సెంటర్స్ వద్ద పోలీసులు అవసరమైన భద్రత చర్యలు చేపట్టనున్నట్లుగా పేర్కొన్నారు. అందుకోసం కమిషనరేట్ పరిధిలో ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద, పరిసర ప్రాంతాల్లో 21న ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు 163 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.
గవర్నమెంట్ గిరిరాజ్ కాలేజ్ (నిజామాబాద్) పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టులుగా పరీక్షలు ఉంటాయని తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ షాప్స్ మూసి ఉంచాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఉంటుందని, సెంటర్ల వద్ద అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంటుందని, గుంపులుగుంపులుగా తిరగవద్దని చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి సీపీ రాజేష్ చంద్ర హెచ్చరించారు.
పరీక్షా కేంద్రాలు ఇవే..
1. ఏవీ ఎంటర్ప్రైజెస్-అర్సపల్లి
2. తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ బిల్డింగ్-(డిచ్ పల్లి)
3. తెలంగాణ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డిచ్ పల్లి)
4. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్- (బోధన్)
5. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్- (బోధన్),
6.గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్-( నిజామాబాద్)
7. బిగాల కృష్ణమూర్తి జెడ్పీహెచ్ఎస్-(మాక్లూర్)
8. తెలంగాణ మైనారిటీ స్కూల్ ఆఫ్ రెసిడెన్స్ గర్ల్స్ మైనారిటీ స్కూల్ ఆఫ్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ నాగారం