నిజాంసాగర్, ఫిబ్రవరి 7: నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో తొమ్మిది, పదకొండో తరగతిలో ఉన్న ఖాళీల భర్తీ కో సం నిర్వహించే పరీక్ష ఈనెల 10న నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సత్యవతి తెలిపారు.
ఈ మేరకు ఆమె బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్ష కోసం ఉమ్మడి జిల్లాలో మొత్తం 11 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను మీ సేవ లేదా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.