Narcotics team raids | వినాయక్ నగర్, అక్టోబర్ 27 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం నార్కోటిక్ బృందం దాడులు నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కృత్రిమ (కల్తీ) కల్లు తయారీకి వినియోగించే మత్తు పదార్థాలు కలిగియున్న సమాచారం మేరకు నార్కోటిక్ ఇన్స్పెక్టర్ పూర్ణేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ తో పాటు మోపాల్ మండల పరిధిలో దాడులు నిర్వహించారు.
వినాయక నగర్ ప్రాంతంలో నివాసం ఉండే ప్రవీణ్ గౌడ్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా మోపాల్ లో గల తమ కల్లు డిపో కు వెళ్తుండగా మార్గమధ్యంలో నార్కోటిక్ బృందం అతన్ని పట్టుకొని తనిఖీ చేశారు. అతడి సమాచారం మేరకు వినాయక నగర్ ప్రాంతంలో ఉండే సాగర్ గౌడ్ అనే మరో వ్యక్తి ఇంట్లో సైతం నార్కోటిక్ టీం తనిఖీలు నిర్వహించారు.
అనంతరం మోపాల్ మండల పరిధిలో గల కల్లు డిపో వద్ద రూ.5 లక్షల విలువ చేసే సుమారు 500 గ్రా.ల అల్ఫ్రోజ్ జోలం (మత్తు పదార్థం)ను సీజ్ చేశారు. అనంతరం పట్టుబడిన ఇద్దరిని తదుపరి విచారణ చేసి, కేసు నమోదు చేసేందుకు మోపాల్ ఎస్సైకి అప్పగించినట్లు సమాచారం.
జిల్లా కేంద్రంలో మార్కోటిక్ బృందం వరుస దాడులు
నిజామాబాద్ మండల పరిధిలో గత 40 రోజుల వ్యవధిలో ఆల్కోటిక్ బృందం కల్తీ కల్లుకు వినియోగించే మత్తుపదార్థాలను పట్టుకునేందుకు రెండుసార్లు దాడులు నిర్వహించారు. గత 40 రోజుల క్రితం సెప్టెంబర్ 16న నిజామాబాద్ మండల పరిధిలోని గుండారం ప్రాంతంలో ఓ డిపో పై దాడి చేసి డిపో నిర్వాకుడు రమేష్ గౌడును అదుపులోకి తీసుకొని అక్కడ నుండి 600 గ్రా.ల అల్ఫ్రోజ్ జోలంను పట్టుకొని ఇద్దరు నిందితులను రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించిన విషయం తెలిసింది. మళ్లీ ఈ రోజు నిజామాబాద్ మండల పరిధిలో నార్కోటిక్ టీమ్ మరో దాడి చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకొని ఆల్ఫా జోలం సీజ్ చేయడంతో చర్చనియాంశంగా మారింది.