ఖలీల్‌వాడి, డిసెంబర్ 8: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషో విజయవంతమైంది. ఆటోషోను శనివారం నగర మేయర్ నీతూకిరణ్ ప్రారంభించగా.. ఆదివారం సాయంత్రం వరకు కొనసాగింది. ఆటోషోలో ప్రదర్శించిన వాహనాలను నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అన్ని కంపెనీలకు చెందిన వాహనాలను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి ప్రదర్శించారు.
సందర్శకులు స్టాళ్లలో బ్రాండెడ్ కంపెనీలకు చెందిన ద్విచక్రవాహనాలు, కార్లను పరిశీలించారు. కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి వాహనాల ధరలను తెలుసుకున్నారు. ఆటోషోలో మొత్తం 16 స్టాల్స్ ఏర్పాటు చేయగా.. కొనుగోలుదారులు కార్లు, బైక్‌లు, ఎలక్ట్రానిక్ కార్లు, బైక్‌లు, స్కూటీలను బుకింగ్ చేసుకున్నారు. బైక్, స్కూటీ ధరలు రూ. 80 వేల నుంచి రూ. 4 లక్షల వరకు ఉండగా.. కార్లు మాత్రం రూ. 7 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు అందుబాటులో ఉంచారు. చాలా మంది టెస్ట్ డ్రైవింగ్ చేస్తూ వాహనాల పనితీరును తెలుసుకొన్నారు. ఆటోషో ప్రాంగణం ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకులతో కిటకిటలాడింది.
ఆటోషో అద్భుతంగా కొనసాగింది. నిస్సాన్ కంపెనీ ఆధ్వర్యంలో సరికొత్త మోడల్స్ కార్లను ప్రదర్శనకు ఉంచాం. కార్లకు మంచి స్పందన లభించింది. రూ. 7.28 లక్షల నుంచి రూ. 14.44 లక్షల వరకు ధరలు ఉన్నాయి.
ఆటోషోకు మంచి స్పందన లభించింది. సందర్శకులు చాలా మంది వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేసి, వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రూ. 7 లక్షల నుంచి రూ. 22 లక్షల వరకు సరికొత్త మాడళ్లలో అందుబాటులో ఉన్నాయి.
కార్లలో అమ్మకాల్లో టాటా కంపెనీ దూసుకుపోతున్నది. అత్యాధునిక ఎలక్ట్రానిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 4.99 లక్షల నుంచి రూ. 23 లక్షల ధరలో కార్లు అందుబాటులో ఉన్నాయి.
సామాన్య ప్రజలకు సరసమైన ధరల్లో హుందాయ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 5.90 లక్షల నుంచి రూ. 21.39 లక్షల వరకు ధర పలుకుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ, ఆకర్షణీయమైన ైస్టెళ్లలో కార్లు అందుబాటులో ఉన్నాయి. పైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్నాం.
ఆటోషోలో రెండు వాహనాలు బుక్ అయ్యాయి. సన్‌రైజ్ కియా కార్లు మార్కెట్లో చాలా తక్కువ ధరలకే అమ్మకానికి ఉన్నాయి. ఇందులో నంబర్ వన్ స్థానంలో కియా కంపెనీ ఉన్నది. ప్రారంభ ధర రూ. 7 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఉన్నాయి. డీజిల్ వెర్షన్లో లీటర్‌కు 24 కి.మీ., పెట్రోల్ వెర్షన్లో లీటర్‌కు 19 కి.మీ. ఇస్తాయి.
ఆటోషో చాలా బాగుంది. అన్ని కంపెనీలు ఒకే వేదిక వద్దకు రావడంతో కొనుగోలుదారులు సులువుగా అందుబాటు ధరల్లో వాహనాలను కొనే అవకాశం లభింది. 100 శాతం ఆన్‌రోడ్ ప్రైస్ అందుబాటులోకి తీసుకువచ్చాం. యూబీఐ ఆధ్వర్యంలో వాహనాలకు 8.08 శాతం వడ్డీ కల్పిస్తున్నాం. హౌసింగ్లోన్కు 8.35, పర్సనల్‌లోన్ 11.25 శాతం వడ్డీతో రుణాలు ఇస్తున్నాం.
ఆటోషోలోని స్టాళ్లలో అన్ని రకాల రాయల్ ఎన్ఫీల్డ్ మోడళ్ల బైక్‌లను ప్రదర్శనకు ఉంచాం. సందర్శకులు లేటెస్ట్ మోడళ్ల బైక్‌లను ఆసక్తిగా తిలకించారు. బైక్‌లను టెస్ట్ డ్రైవ్ చేశారు. రూ. 1.90 లక్షల నుంచి రూ. 4.60 లక్షల వరకు ధరలు అందుబాటులో ఉన్నాయి.
ఆటోషోకు మంచి స్పందన లభించింది. సాయిరాం హోండా ఆధ్వర్యంలో చాలా వెరైటీ వాహనాలను స్టాళ్లలో ప్రదర్శించాం. సరసమైన ధరలకు వాహనాలు అందుబాటులో ఉన్నాయి. రూ. 90 వేల నుంచి రూ. 1 లక్షా 80 వేల వరకు వివిధ మోడళ్లలో వాహనాల అందుబాటులో ఉంచాం.
చెతక్ కంపెనీ ఆధ్వర్యంలో వివిధ రకాల మోడళ్ల స్కూటీలను ప్రదర్శనకు ఉంచాం. లేటెస్ట్ లుక్‌తో అన్ని రకాల రంగుల్లో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులో ఉంచాం. చెతక్ వాహనాలపై సందర్శకులు ఆసక్తి కనబర్చారు. వందల మంది వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేశారు. రూ. 1.16 లక్షల నుంచి రూ. 1.45 లక్ష వరకు ధరలు ఉన్నాయి.