కంటేశ్వర్ : తవ్వారు..వదిలేశారు అనే శీర్షికన గత ఆదివారం నమస్తే తెలంగాణ ( Namaste Telangana) దినపత్రికలో వచ్చిన వార్త కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ మీసేవ వద్ద మున్సిపల్ అధికారులు వాటర్ పైప్ లైన్ ( Water Pipeline) మరమ్మతుల్లో భాగంగా గుంతను త్రవ్వి నామమాత్రంగా పూడ్చివేశారు. దీని వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను వార్త రూపంగా నమస్తే తెలంగాణ ప్రచురించింది.
ఈ వార్త కథనానికి శనివారం అధికారులు స్పందించి సిమెంట్ కాంక్రీట్ కలిపి గుంతను పూడ్చివేశారు. ఈ సందర్భంగా రోడ్డుపై ప్రమాదకర గుంతను అధికారుల దృష్టికి తెచ్చిన నమస్తే తెలంగాణ దినపత్రికను పలువురు అభినందిస్తున్నారు.