పాలకవీడు, జాన్ 13 : ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అభివృద్ధి నిరోధకుడు అని హుజుర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవా రం మండలంలోని అలింగాపురం, బొత్తలపాలెం గ్రామాల్లో కల్యాణలక్ష్మి చెక్కులను ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు అందజేశారు. కోమటికుంట లో 5 దళితబంధు యూనిట్లను పంపిణీ చేశారు బొత్తలపాలెంలో క్రీడా ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని సమగ్రాభివృద్ధి చేస్తుంటే ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొందరితో కలిసి కోర్టు కేసులతో అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రచ్చబండ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించ డానికి తిరుగుతున్నాడని విమర్శించారు. నియో జకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కేసులు వేయిస్తూ అభివృధ్ధి నిరోధకుడిగా మారా డని దుయ్యబట్టారు. తాను రెండున్నర ఏండ్లలో చేసిన అభివృద్ధిని చూసి ఉత్తమ్ భయపడుతు న్నాడన్నారు. ఆయా కార్యక్రమాల్లో తాసీల్ధార్ శ్రీదేవి, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండ లాధ్యక్షుడు కిష్టిపాటి అంజిరెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ యరెడ్ల సత్యనారయణరెడ్డి, దర్గారావు, వైస్ ఎంపీపీ ఉపేందర్, సర్పంచులు వీరారెడ్డి, లక్ష్మమ్మ, రామలక్ష్మమ్మ రవినాయక్, చినవీరారెడ్డి, సైదిరెడ్డి, వెంకటరెడ్డి, భిక్షం, నర్సింహ, వెంకటే శ్వర్లు పాల్గొన్నారు.
కనకమ్మ మృతి బాధాకరం : ఎమ్మెల్యే
గరిడేపల్లి : మండలంలోని కీతవారిగూడెం గ్రామ మాజీ సర్పంచ్ సంకబుడ్డి నర్సయ్య తల్లి సంకబుడ్డి కనకమ్మ మృతి బాధాకరమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం ఆమె దశదినకర్మ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు గ్రామంలో కీత కుటుంబీకులు నూతనంగా నిర్మించిన కోటమైసమ్మ దేవాలయంలో ప్రతిష్ఠించనున్న అమ్మవారి విగ్రహ ఊరేగింపులో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కడి యం వెంకటరెడ్డి, సర్పంచ్ కీత జ్యోతీరామారావు, టీఆర్ఎస్ నాయకులు కీత నాగరాజు, పిడమర్తి అంజి, నరేశ్, సాయికుమార్, వీరబాబు పాల్గొన్నారు.