ఉమ్మడి జిల్లాలో శుక్రవారం నాగపంచమి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పలు ఆలయాల ప్రాంగణాల వద్ద, గ్రామశివారులో ఉన్న పుట్టల్లో భక్తులు పాలుపోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకున్నారు.
ఆడపిల్లలు తమ అన్నదమ్ములకు ఆవుపాలతో కండ్లు కడిగి ఆశీర్వాదాలు తీసుకున్నారు. జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆవుపాలను ఉచితంగా పంపిణీ చేశారు.