ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బక్రీద్ సందర్భంగా సోమవారం ముస్లిములు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. త్యాగానికి ప్రతీకగా ఈద్-ఉల్-జుహా(బక్రీద్)ను ముస్లిములు జరుపుకొంటారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని ఆయా ఈద్గాలు, మసీదుల వద్ద ప్రార్థనలు చేశారు. మత గురువులు ముస్లిములకు బక్రీద్ సందేశాన్ని వినిపించారు. ముస్లిములకు ప్రభుత్వ అధికారులు, రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.