భీమ్గల్/బాల్కొండ/మోర్తాడ్/ ఏర్గట్ల, నవంబర్ 11: బీసీల జోలికి వస్తే ఖబడ్దార్ మోదీ అంటూ మున్నూరు కాపు సంఘం నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇండ్లు, వ్యాపార సంస్థలపై జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులను నిరసిస్తూ శుక్రవారం నిజామాబాద్ జిల్లాలోని పలుచోట్ల మున్నూరు కాపు సంఘ సభ్యులు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) సభ్యులు రాస్తారోకో నిర్వహించారు, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. భీమ్గల్ మండల కేంద్రంలో మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సామాజిక వర్గానికి చెందిన మంత్రిపై కక్ష గట్టి కావాలని దాడులు చేయించి మోదీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నదని వారు మండిపడ్డారు. తక్షణమే ఈడీ దాడులను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో బీజేపీకి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు కన్నె సురేందర్, మల్లెల లక్ష్మణ్, లింబాద్రి, తోట శంకర్, నీలం రవి, సాయిప్రసన్న, మూడెడ్ల ప్రకాశ్, రాజేశ్వర్, రాజేందర్, నర్సయ్య, గంగారాం, నరేశ్, శ్రీనివాస్, సునీల్ నారాయణ పాల్గొన్నారు.
బాల్కొండలో మండలంలోని అన్ని గ్రామాల నుంచి మున్నూరుకాపు కులస్తులు మోదీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించి అనంతరం దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో మున్నూరుకాపు ప్రజాప్రతినిధులు ఈపీ.నారాయణ, కన్న పోశెట్టి, మామిడి రాకేశ్, ఆకుల నరేందర్, వేంపల్లి చిన్న బాలరాజేశ్వర్, వేంపల్లి పెద్దబాల్రాజేశ్వర్, ధర్మాయి రాజేందర్, గడ్డం రవి, గాండ్ల రాజేశ్, హరీశ్, ఆర్కరి కిషన్, ఎంబరి మహిపాల్, పెంటు లింబాద్రి, జక్క లింబారెడ్డి, జక్క నర్సారెడ్డి, జక్క రాజారెడ్డి, జాపు మల్లేశ్, జాపు భూమన్న, ఎంబరి శరత్, ఒద్ది లింగం, కొండ అశోక్, న్యావనంది సాయన్న, రాజేందర్, సాయన్న, రాకేశ్ పాల్గొన్నారు.
కమ్మర్పల్లి మండల కేంద్రంలో మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మండలంలోని అన్ని గ్రామాల మున్నూరుకాపు సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఏర్గట్ల మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏర్గట్లలో మున్నూరు కాపు సంఘ సభ్యుడు, జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్ మాట్లాడారు. కార్యక్రమంలో ఏర్గట్ల సర్పంచ్ గుల్లే లావణ్యా గంగాధర్, బోనగిరి రమేశ్, కుశ రాకేశ్, ఆకుల రాజేందర్, సాగర్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.