పోతంగల్ ఫిబ్రవరి 26 : మధ్యాహ్న భోజనం పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మండల ప్రత్యేక అధికారి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ మున్ని నాయక్ హెచ్చరించారు. పోతంగల్ మండల కేంద్రంలోని ఉర్దూ జడ్పిహెచ్ఎస్ పాఠశాలను మండల ప్రత్యేక అధికారి మున్ని నాయక్, ఎంపీడీవో చందర్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం బియ్యం పరిశీలించిన ఆయన దాంట్లో ఉన్న వ్యర్ధాలు చూసి అసహనం వ్యక్తం చేశారు.
విద్యార్థులు అనారోగ్యం పాలైతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. విద్యార్థులకు నాణ్యతమైన భోజనం కూరగాయలు, కూరలు వండి పెట్టాలని ఇంచార్జీ హెచ్ఎం కు సూచించారు. అనంతరం విద్యార్థులతో, ఉపాధ్యాయులతో కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న టాయిలెట్లను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ధనరాజ్, గ్రామ కార్యదర్శి యాదవ్,ఉపాధ్యాయులు రవీంద్రబాబు, ఖాదర్, జయకృష్ణ తదితరులున్నారు.