కంఠేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలను చేపట్టడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో ఎమ్మార్పీఎస్ (MRPS protests) నాయకులు గురువారం నిరసన దీక్షలు చేపట్టారు. తెలంగాణ మోచి సంఘం ( Mochi Sangam ) రాష్ట్ర అధ్యక్షుడు కొల్లెపు ముత్యం నిరసనకు హాజరై సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణ కోసం ప్రభుత్వం చట్టబద్ధత చేకూర్చే వరకు మద్దతు కొనసాగిస్తామని వెల్లడించారు. జనాభా నిష్పత్తిలో తక్కువ ఉన్న మాలలకు 5శాతం రిజర్వేషన్ ( Reservation ) ఇచ్చి 30 లక్షల పైచిలుకు ఉన్న జనాభా ఉన్న మాదిగలకు కేవలం తొమ్మిది శాతం రిజర్వేషన్ కేటాయించడం అన్యాయమని పేర్కొన్నారు.
ఈ రిజర్వేషన్ 12 శాతం పెంచే వరకు ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన హామీపై నిలబడడం లేదని విమర్శించారు. నిరసన దీక్షలో తెలంగాణ మోచి సంక్షేమం సంఘం ప్రధానకార్యదర్శి కొండ్లెపు సుధాకర్, అర్ముర్ లీడ్క్యాప్ అధ్యక్షులు ఓటరికారి రవి, ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనకప్రమోద్, ప్రవీణ్, యమునక్క, సత్తక్క, మోచినాయకులు రాజేంద్రప్రసాద్, చిన్నసాయిలు, భూమయ్య, లింగయ్య, సింగయ్య, సాయిలు, శంకర్, వినోద్, రాజు, లింగేశ్వర్, అశోక్, గోపి, చిట్టిబాబు, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
,