కోటగిరి : మండల కేంద్రంలోని ఎమ్మార్పీఎస్(MRPS) పార్టీ కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పోచిరాంను ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. అంతకుముందు ఉద్యమంలో అమరులైన వారి ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరాం మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా గ్రామ స్థాయి నుంచి పని చేసుకుంటూ జిల్లా స్థాయి వరకు ఎదిగానన్నారు.
తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు పోచిరాం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కన్నం దావులయ్య, మండల నాయకులు కన్నం శ్రీనివాస్, విజయ్, దినేష్, వెంకటి, రాము, సాయిలు, నాగేష్,రాజయ్య, భూమయ్య, రవీందర్, తదితరులు ఉన్నారు.