బాల్కొండ, ఫిబ్రవరి 16: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ లోలపు గౌతమీ సుమన్ అన్నారు. గురువారం కమ్మర్పల్లి మండలంలోని హాసకొత్తూర్‌లో కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ ఏనుగు పద్మా రాజేశ్వర్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్‌రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ సత్యనారాయణ, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వేల్పూర్,ఫిబ్రవరి16: పచ్చలనడ్కుడలో కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ ఏనుగు శ్వేత ప్రారంభించారు. ఈ శిబిరం మార్చి 17 వరకు కొనసాగుతుందని, 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. కార్యక్రమానికి ఎంపీపీ బీమా జమున, జడ్పీటీసీ భారతి రాకేశ్చంద్ర, ఎంపీటీసీలు గంగాధర్, గంగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ లింబారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జేడి నాగధర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ రమేశ్ పాలొగన్నారు.
రెంజల్, ఫిబ్రవరి 16: నీలాలో 2,936 మందికి కంటి పరీక్షలు చేసినట్లు డాక్టర్ కావ్య తెలిపారు. సర్పంచ్ గౌరాజీ లలితారాఘవేందర్తో కలిసి గురువారం వివరాలను వెల్లడించారు. గత నెల 19న ప్రారంభమైన శిబిరం 20 రోజుల పాటు కొనసాగిందని, పేర్కొన్నారు. సిబ్బందిని అభినందించారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.