Nizamabad | రెంజల్, ఆగస్టు 25 : రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలోని ఉన్నత పరిషత్ పాఠశాల లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ బీజేపీ మండల ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నాయకులు పండ్లు, పెన్నులు, మిఠాయిలు పంచిపెట్టారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు క్యాతం యోగేష్, జిల్లా పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు మేక సంతోష్, బీజేవైఎం మండల అధ్యక్షుడు అజయ్, రఘుపతి, లక్ష్మయ్య, శక్తి కేంద్ర ఇంచార్జీలు, బూత్ కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.