వినాయక్‌నగర్, మే 13: మీరు డ్యూటీ చేస్తున్నారా లేక టైం పాస్ చేస్తున్నారా అంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ మైనార్టీ ఏరియాలోని ఓ పోలింగ్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రిసైడింగ్ ఆఫీసర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలు బురకాలు ధరించి వస్తే వారు నిజమైన ఓటరా కాదా అని ఎలా గుర్తిస్తారంటూ ఆఫీసర్‌ను ప్రశ్నించారు.
మరో పోలింగ్ కేంద్రం వద్ద ఏసీపీ రాజా వెంకటరెడ్డిపై ఎంపీ మండిపడ్డారు. డిపార్ట్మెంట్ మొత్తం చెంచాగిరీ అయిపోతున్నదంటూ, అతిగా చేయవద్దు కెరీర్‌ను పాడు చేసుకోవద్దంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరు వెళ్లండి సార్ తాము చూస్తామంటూ ఏసీపీ సమాధానం ఇవ్వగా నన్ను వెళ్లమనడానికి నువ్వు ఎవ్వరయ్యా? మీ డ్యూటీ మీరు చేసుకొండని ఎంపీ అనడంతో పోలీసు సిబ్బంది విస్మయం వ్యక్తంచేశారు.