ఖలీల్వాడి, మే 15: రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు సింగిల్స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు బుధ వారం తెలిపాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులతో స్వచ్ఛందంగా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. నిర్మాతలు థియేటర్ల అద్దె పెంచాలని, పరిస్థితులు అనుకూలిస్తే ప్రదర్శనలు కొనసాగిస్తామన్నారు.