Anganwadi bata | కోటగిరి : అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం వల్లభపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ గోపి లక్ష్మి ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్ గోపి లక్ష్మి మాట్లాడుతూ శిశు మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10నుండి 17 వరకు గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో అమ్మ మాట.. అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.
గ్రామాల్లో రెండేళ్లలోపు ఉన్న పిల్లలను గుర్తించి వారికి అంగన్వాడీ కేంద్రంలో చేర్పించడం జరిగిందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో వారం రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహించామన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ, బాలింతలకు, చిన్నారులకు అందించే పౌష్టికాహార గురించి వివరించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళ సాధికారత కేంద్రం స్వప్న, స్థానిక హెడ్ మాస్టర్ నీలకంఠరావు, అంగన్వాడీ టీచర్లు బాల్ లక్ష్మి, సుజాత, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.