Mother’s milk | కోటగిరి, ఆగస్టు 7 : అమ్మ పాలు అమృతమని ఐసీడీఎస్ బోధన్ ప్రాజెక్ట్ సీడీపీవో పద్మ అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గురువారం కోటగిరి మండల కేంద్రంలోని జరిన కాలనీ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీడీపీవో పద్మ పాల్గొని తల్లి పాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. పిల్లలకు ఆరు నెలలు వచ్చేవరకు తల్లిపాలే పట్టాలని సూచించారు. బిడ్డకు తల్లి పాలు పట్టడం ద్వారా తల్లి బిడ్డలకు కలిగే ప్రయోజనాలను వివరించారు.
ఈ సందర్భంగా గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. పుట్టిన ఆరు, ఏడు మాసాల చిన్నారులకు అన్న ప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు సంవత్సరాలు నిండిన పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ కోటగిరి, పోతంగల్ మండలాల సూపర్ వైజర్లు కొమురవ్వ, గోపి లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు కళావతి, కృష్ణకుమారి, విజయలక్ష్మి, సావిత్రి, జమున గంగామణి, ఏఎన్ఎం మంజుల, ఆశ అనురాధ, గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.