ఎల్లారెడ్డి రూరల్/నాగిరెడ్డిపేట, జూన్ 11: ఉన్నత పదవుల్లో ఉన్న చాలా మంది ప్రభుత్వ బడుల్లో చదువుకున్నవారేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేట ప్రభుత్వ పాఠశాల, నాగిరెడ్డిపేట కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థులకు ఆయన మంగళవారం యూనిఫామ్స్, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తానుకూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని చెప్పారు. తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఎంపీపీ కర్రె మాధవి, ఎంఈవో వెంకటేశం, ఐకేపీ ఏపీఎం ప్రసన్నారాణి, మున్సిపల్ మేనేజర్ వాసంతి, నాగిరెడ్డిపేట జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.