ఖలీల్‌వాడి/సిరికొండ, జూన్ 17: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి నివాసానికి చేరుకుంటారు. 11.30 గంటలకు సిరికొండలోని లొంక రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం రావుట్ల గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ తోట రాజన్న ఇంటిని సందర్శిస్తారని స్థానిక జాగృతి నాయకులు తెలిపారు.