మద్నూర్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం (Election campaign) నిర్వహించారు. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున తమ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధిలో దూసుకుపోవచ్చని పేర్కొన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను కాంగ్రెస్ ప్రతినిధులు పరిష్కరిస్తారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు హన్మండ్లు స్వామి, హనుమంత్ యాదవ్, జావిద్ పటేల్ తదితరులు ఉన్నారు.