కామారెడ్డి, ఫిబ్రవరి 17 : ఇన్నేండ్లు వయస్సులో పెద్దవారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని గౌరవించానని, అనవసరంగా తన జోలికి వస్తే ఆయన చరిత్ర మొత్తం బయటపెడతానని కామారెడ్డి ఎ మ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. తాను గెలిచానని విర్రవీగుతున్న ముసలి నక్క షబ్బీర్ అని ఘాటుగా విమర్శించారు. కామారెడ్డి పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
షబ్బీర్ అలీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో దొంగ సా రా, దొంగ కట్టే అమ్ముకొని బతికాడని, ఇప్పటికీ ఆయనపై ఫారెస్టు ఆఫీసులో కేసు ఉన్నదని తెలిపారు. 1989లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు వీడియోలు, ఫొటోలు ఉన్నాయని, అప్పు డు ఆయన ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత అ ని ప్రశ్నించారు. ఆయన ఇంటిపై ఐదు ఫ్లోర్లు కట్టుకున్నాడని, ఫైర్ ఇంజిన్ కూడా తిరగదని అన్నారు. షబ్బీర్ అలీకి 9సార్లు పోటీ చేయడానికి అవకాశం ఇస్తే రెండు సార్లు మాత్రమే గెలిచారని, అయినా కూ డా ఆస్తులు మాత్రం పెరిగాయని పేర్కొన్నా రు.
ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఆయ న భార్య పిల్లలతో గుడి, దర్గా, మసీద్‌కు రావాలని సవాల్ విసిరారు. షబ్బీర్ అలీ కామారెడ్డికి పట్టిన శని అని విమర్శించారు. కామారెడ్డిలో షబ్బీర్, ఆయన తమ్ముడు కబ్జాలు చేశారని ఆధారాలతో సహా ఉన్నాయని తెలిపారు. తాను ఎమ్మెల్సీగా పోటీ చేస్తే తన దగ్గర రూ. 5 లక్షలు తీసుకున్నాడని ఆరోపించారు. ఇందిరాగాంధీ విగ్ర హం ఏర్పాటు చేయడానికి రూ. 2 లక్షలు వసూలు చేశాడని ఆరోపించారు.