పిట్లం, జనవరి 17: నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధికి కృషిచేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. మండలంలోని కంబాపూర్‌లో రూ. 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరు గ్యారెంటీలను అందేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, డీఎల్పీవో శ్రీనివాస్, సర్పంచ్ కవిత, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్వకేట్ రాంరెడ్డి, వీర్సంగప్ప, రమేశ్పటేల్, రాజుదేశాయి, నజీర్సేట్, ఇంరోజ్, బొడ్లరాజు తదితరులు పాల్గొన్నారు.