ఇందల్వాయి, ఫిబ్రవరి16: ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని అన్సాన్పల్లి గ్రామానికి చెందిన మున్నూరుకాపు, గంగపుత్ర కమ్యూనిటీహాల్ నిర్మాణాలకు మంజూరైన ప్రొసీడింగ్ కాపీలను సంఘం ప్రతినిధులకు గురువారం జిల్లా కేంద్రంలో ఆయన అందజేశారు. మున్నూరుకాపు సంఘానికి రూ. 5 లక్షలు, గంగపుత్ర కమ్యూనిటీ హాల్‌కు రూ. 5 లక్షలు మంజూరు అయినట్లు కులసంఘాల సభ్యులు తెలిపారు. అనంతరం సంఘ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు.
మండలంలోని ఎల్లారెడ్డిపల్లి వీడీసీ సభ్యులు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను కలిసి సన్మానించారు. కల్యాణ మండపానికి నిధులు మంజూరు చేయాలని కోరుగా సానుకూలంగా స్పందించినట్లు సభ్యులు తెపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, సర్పంచ్ గుర్రపు నరేశ్, ఎంపీటీసీ బాపురావు, ఉపసర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, పార్టీ మండల జనరల్ సెక్రటరీ పులి శ్రీనివాస్, పార్టీ మండల కోశాధికారి పంపరి రమేశ్, సామాజిక కార్యకర్త పులి సాగర్, వీడీసీ సభ్యులు సత్యనారాయణ, సక్కి నారాయణ, సట్ల చిన్న బొర్రన్న, ఒంటరి నర్సయ్య, చెవుల సాయిలు, బుచ్చన్న, రఘు, శంకర్ పాల్గొన్నారు.
సిరికొండ, ఫిబ్రవరి16: మండలంలోని లొంక రామలింగేశ్వర స్వామి జాతర, మహాశివరాత్రి ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డిజగన్కు ఆహ్వాన పత్రికను గురువారం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎన్నం రాజారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ, ప్రకాష్, సంతోష్, భూపతిరాజ్, ప్రకాశ్ తదితరులు ఉన్నారు.