Mittapalli Ritwika | కంటేశ్వర్, డిసెంబర్ 21 : ఆల్ ఇండియా యూనివర్సిటీ ఆక్వాటిక్స్ నేషనల్ ఛాంపియన్షిప్ – 2025-26 స్విమ్మింగ్ పోటీలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ (చెన్నై) తమిళనాడు రాష్ట్రంలో డిసెంబర్ 18నుండి డిసెంబర్ 22 వరకు నిర్వహించారు. నేషనల్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ యూనివర్సిటీ స్విమ్మింగ్ పోటీలలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన మిట్టపల్లి రిత్విక కళింగ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్సిటీ భువనేశ్వర్ ఒడిస్సా రాష్ట్రం తరఫున పాల్గొని ఉత్తమమైన ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించింది.
50 మీటర్స్ బెస్ట్ స్ట్రోక్ లో బంగారు పథకం సాధించిన జిల్లా క్రీడాకారిణి మిట్టపల్లి రిత్విక 2025 సంవత్సరంలో స్విమ్మింగ్ లో జిల్లాలోనే జాతీయ, అంతర్జాతీయ గోల్డ్ సిల్వర్ , బ్రౌన్జ్ పథకాలు సాధించిన మొట్టమొదటి క్రీడాకారిణిగా తన పేరు మీద రికార్డ్ సొంతం చేసు కున్నది. నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్షిప్ యూనివర్సిటీ స్విమ్మింగ్ పోటీలో బంగారు పతకం సాధించిన రిత్వికను కలింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ డైరెక్టర్, రాజ్యసభ సభ్యుడు అచ్యుత సమంత, తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శి ఉమేష్, ఉపాధ్యక్షుడు జీ మైపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గడిల శ్రీరాములు, కార్యవర్గ సభ్యులు కర్ణాటక శ్రీనివాస్, శ్యాంసుందర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, ముత్యాల శ్రీనివాస్, రాగిణి తదితరులు అభినందించారు.