మెండోరా, జూన్ 25: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాకతీయ కాలువపై అధునాతన టెక్నాలజీతో వంతెనలు నిర్మిస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మెండోరా మండలం సోన్‌పేట్ – పోచంపాడ్ గ్రామాల మధ్య కాకతీయ కెనాల్ జీరో పాయింట్ వద్ద రూ.కోటీ 38లక్షలు, మెండోరా-దూద్గాం వద్ద కాకతీయ కాలువపై రూ.కోటీ 24లక్షలతో నిర్మిస్తున్న వంతెనలను మంత్రి వేముల ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ అధికారులు, కాంట్రాక్టర్‌తో మాట్లాడి నిర్మాణ పనులపై ఆరా తీశారు.
పనులు చురుగ్గా సాగుతున్నాయని, నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అనంతరం విలేకరులతో మంత్రి వేముల మాట్లాడారు. అధునాతన టెక్నాలజీతో కాకతీయ కాలువపై పోచంపాడ్-సోన్‌పేట్ గ్రామాల మధ్య దశాబ్దాల కాలంగా వంతెన ఉండగా రైతులు, రెండు గ్రామాల ప్రజల అభిష్టం మేరకు నూత న బ్రిడ్జి నిర్మిస్తున్నామన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.90లక్షల నిధులు మంజూరు చేశామని, కాలువలో నిరంతరం నీరు పారుతున్న నేపథ్యంలో సెంట్రింగ్ వేసి బ్రిడ్జిని నిర్మించుకోవడం సాధ్యం కాలేదన్నారు. వేసవి కాలంలో బాల్కొండ నియోజకవర్గ రైతులు మక్క, సజ్జ, నువ్వులు లాంటి పంటలు వేస్తారని, వాటికి నీళ్లు అవసరమని వివరించారు.
కెనాల్లో నీళ్లు ఆపకుండా బ్రిడ్జి నిర్మాణ పనులు సాగట్లేదని, నీటి విడుదల ఆపితే రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో అధునాతన టెక్నాలజీతో సెంట్రింగ్ లేకుండా బీమ్స్, టెక్ స్లాబ్ వేసే అవకాశమున్నదని ఇంజినీర్లు అధికారుల దృష్టికి తీసుకురాగా ఆ పద్ధతిలో చేద్దామని, నీటి విడుదల చేపడుతూ పనులు పూర్తి చేసుకోవచ్చని సూచించినట్లు తెలిపారు. అందుకు అదనంగా మరిన్ని నిధులు కావాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించామన్నారు. మరో రెండు నెలల్లో పనులు పూర్తవుతాయని మంత్రి చెప్పారు.
తన విజ్ఞప్తి మేరకు ప్రజలు, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బ్రిడ్జి నిర్మాణానికి సీఎం కేసీఆర్ అదనంగా నిధులు ఇచ్చారని, బాల్కొండ నియోజకవర్గ పక్షాన సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మంత్రి వెంట డీసీసీబీ డైరెక్టర్ నాగంపేట్ శేఖర్‌రెడ్డి, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణ్ నవీన్‌గౌడ్, సర్పంచులు మిస్బా, గోలి ప్రకాశ్, పసుల సుజాతాశ్రీనివాస్, మచ్చర్ల రాజారెడ్డి, ఎంపీటీసీలు జాన్‌బాబు, దేవేందర్, మండల నాయకులు గంగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్ సంపంగి సతీశ్, ఎస్కే ఖాదర్ ఉన్నారు.