నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తాధ్వర్యంలో నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. 20 స్టాళ్లతో ఏర్పాటైన ఈ ప్రదర్శనకు తొలి రోజు సందర్శకుల నుంచి మంచి స్పందన వచ్చింది. నిజామాబాద్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు, ప్రముఖ బ్యాంకులు పాల్గొంటున్న ఈ షోను రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి, ఏడీవీటీ జీఎం సురేందర్‌రావు తదితరులతో కలిసి ఆయన స్టాళ్లను పరిశీలించారు. సీఎం కేసీఆర్ కృషి, ముందుచూపుతో తెలంగాణలో సంపద సృష్టి జరుగుతున్నదని, ఆ సంపదను వివిధ సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందిస్తున్నట్లు మంత్రి వేముల చెప్పారు. తద్వారా వారి కొనుగోలు శక్తి పెరిగి అన్ని రంగాల్లో వృద్ధి సాధ్యమవుతున్నదన్నారు. హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో మాత్రమే నిర్వహించే ప్రాపర్టీ షోను వేగంగా అభివృద్ధి చెందుతున్న నిజామాబాద్ నగరంలో నిర్వహిస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రయత్నం అభినందనీయమన్నారు.
కమ్మర్పల్లి/ ఖలీల్‌వాడి/ డిచ్పల్లి, జనవరి 21: సొంతింటిని సమకూర్చుకోవాలనుకునే వారికి ఉపయోగపడేలా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు విశేష స్పందన లభించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో శనివారం ప్రాపర్టీ షోను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్స్, బ్యాంకర్లు ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శకులతో కిటకిటలాడాయి. ఉమ్మడి జిల్లాలకు చెందిన ఔత్సాహికులు ప్రాపర్టీషో ను సందర్శించి నిజామాబాద్, కామారెడ్డితోపాటు హైదరాబాద్‌లాంటి మహానగరాల్లోని ప్లాట్లు, వెంచర్లు, విల్లాస్, అపార్ట్మెంట్ ఫ్లాట్లు, ఇండిపెండెంట్ ఇండ్ల గురించి తెలుసుకున్నారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ, బ్యాంకర్లతో కలిపి ఒకే వేదిక ఏర్పాటు చేయడంపై నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలకు నగరవాసులు కృతజ్ఞతలు తెలిపారు.
– బోధన్/ ఖలీల్‌వాడి/ డిచ్పల్లి, జనవరి 21
మా వెంచర్లు తూఫ్రాన్, మనోహరాబాద్, చేగుంట వద్ద 44వ నంబర్ జాతీయ రహదారి పక్కనే ఉన్నా యి. ప్రస్తుతం మేము చేస్తున్న 5 వెంచర్లతోపాటు ఇప్పటివరకు 14 వెంచర్లు చేశాం. గజం ధర రూ.8,999 నుంచి మొదలు రూ.25,000 వరకు ఓపెన్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్ఎండీఏ, డీటీసీపీ, రెరా అనుమతులు ఉన్నాయి.
– పులి అర్జున్‌రావు, మార్కెటింగ్ డైరెక్టర్,భూమిస్పేస్ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్
మా ఎన్నార్ ప్రాపర్టీస్ ఒపెన్ ప్లాట్లు కొనుగోలు చేస్తే కొనుగోలుదారులకు భవిష్యత్తులో మంచి సంపద వచ్చినట్లే. మా వెంచర్లు కొంపల్లి, గుండ్ల పోచమ్మపల్లి, కండ్లకోయ, మేడ్చల్ వద్ద ఉన్నాయి. గజం ధర రూ.19,000 నుంచి ప్రారంభమవుతుంది. మా ప్లాట్లు కొనడంతో భవిష్యత్తులో ఎంతో ఉపయోగం ఉంటుంది.
– అరుగొండ నర్సింహులు, ఎన్నార్ ప్రాపర్టీస్
సంపద సృష్టి కోసం మా వర్తుసా లైఫ్ స్పేస్ ఇండియాలో ఒపెన్ ప్లాట్లు కొనుగోలు చేయాలని కోరుతున్నాం. సదాశివపేట్, కడ్తాల్, షాద్‌నగర్, చౌటుప్పల్‌లో మా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ ఉన్నాయి. హెచ్ఎండీఏ, డీటీసీపీ, రెరా అనుమతులు ఉన్నాయి.
– రేణుక, డిప్యూటీ సీజీఎం, వర్తుసా లైఫ్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
నిజామాబాద్ నగరానికి అతి సమీపంలో మాధవనగర్ బైపాస్ రోడ్డులో మా అవని ఇందూరి టౌన్షిప్ ఉంది. ఈ టౌన్‌షిప్‌కు నుడా అనుమతితోపాటు రెరా సర్టిఫికెట్ ఉంది. బ్యాంక్ రుణాలతో ఇందులోని ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేయవచ్చు. ఇందుకు సంబంధించిన సహాయ, సహకారాలను అందిస్తున్నాం.. ప్రభుత్వ ఉద్యోగులు వాయిదాలపై ఒపెన్ ప్లాట్లను కొనవచ్చు.
– గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, షేర్ హోల్డర్,అవని ఇందూరి టౌన్షిప్
నిజామాబాద్ నగరం గంగస్థాన్ ఫేస్-2లో అన్ని వసతులతో కూడిన లగ్జరీ అపార్ట్మెంట్ ‘సాయిభువన రెసిడెన్సీ’లో 3బీహెచ్‌కె ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. లగ్జరీగా ఈ అపార్ట్‌మెంట్‌ను నిర్మించాం. ఇందులో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, క్లబ్ హౌస్, అపార్ట్మెంట్ పైన జిమ్ ఏర్పాటు చేశాం. సుఖవంతమైన జీవితానికి ఈ లగ్జరీ అపార్ట్మెంట్ గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నది.
– రాఘవేందర్రావు, ఎండీ, నిర్విఘ్న ఇన్ఫ్రా
మా విశ్వధరణి డెవలపర్స్ ఆధ్వర్యంలో మేడ్చల్ – షామీర్పేట్ రోడ్డులో 17 ఎకరాల వెంచర్ స్టార్ట్ అయింది. కొనుగోలుకు ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. షామీర్పేట్లో రింగ్ రోడ్డు ఫేసింగ్కు మరో వెంచర్‌ను 64 ఎకరాల్లో చేశాం. వీటిలో ఓపెన్ ప్లాట్ల నుంచి విల్లా ప్లాట్ల వరకు కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ రుణాల సౌకర్యం కల్పిస్తున్నాం. హెచ్ఎండీఏ, డీటీసీపీ, రెరా అనుమతులు ఉన్నాయి.
– రమేశ్, డైరెక్టర్, విశ్వధరణి డెవలపర్స్
డిచ్పల్లి /ఖలీల్‌వాడి జనవరి 21: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో చాలా బాగున్నది. ఇంత వరకు ఎవరూ చేయనటువంటి ప్రయత్నం నమస్తే తెలంగాణ , తెలంగాణ టుడే చేయడం అభినందనీయం.
-ధర్మేందర్,నిజామాబాద్
ప్రాపర్టీ షోలు ఏర్పాటు చేయడంతో మాలాంటి మధ్యతరగతి వారికి మేలు జరుగుతుంది. బ్రోకర్లు, దళారులు లేకుండా ఇష్టమైన స్థిరాస్తిని, అసలైన ధరకు కొనుగోలు చేసే అవకాశం కలిగింది. స్టాల్స్‌ను సందర్శించి ఇండ్లు, ప్లాట్ల ధరలతోపాటు బ్యాంకు రుణాల గురించి తెలుసుకున్నాం.
– భోజన్న, నిజామాబాద్
ప్రాపర్టీ షోలో పెద్దపెద్ద నిర్మాణ సంస్థలు భాగస్వాములవ్వడం చాలా బాగుంది. నమస్తే తెలంగాణ ద్వారా ఇలాంటి షో నిర్వహించి అన్ని నిర్మాణ, రియల్ ఎస్టేట్ సంస్థలను ఒక్క చోట చేర్చి ప్రజలకు చేరువచేశారు.
– సుమన్, నిజామాబాద్
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోలో ఒకే చోట వ్యాపార నిర్మాణ సంస్థలు ఉండి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించడం చాలా బాగున్నది. దీంతో ఇండ్లు, ఫ్లాట్లు కొనాలనుకునే వారికి ఎలాంటి ఇబ్బందు లేకుండా చేశారు. నిర్వాహకులకు ధన్యవాదాలు.
– భాగ్యరాజన్, నిజామాబాద్
అన్నివర్గాల వారికి ఉపయోగపడేలా ప్లాట్లు, ఇండ్లు, ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. నిజామాబాద్‌తోపాటు హైదరాబాద్‌లాంటి మహానగరాలకు చెందిన కంపెనీల ద్వారా అక్కడి నిర్మాణాలను కూడా తెలుసుకునే అవకాశం ఉన్నది. బ్యాంకు స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయించి ఇబ్బందులు తీర్చారు.
– శేఖర్, నిజామాబాద్
ప్రాపర్టీ షో ద్వారా జిల్లా ప్రజలకు అందుబాటులో అనేక రియల్ ఎస్టేట్, నిర్మాణ, బ్యాంకర్లను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయం. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు కృతజ్ఞతలు. దాదాపు 20 స్టాల్స్‌లో మాకు నచ్చిన నిర్మాణ కంపెనీని, నచ్చిన ధరకు కొనుగోలు చేసేందుకు వీలుగా ఉన్నది. ఈ విధానం చాలా బాగున్నది.
– రాజు, నిజామాబాద్
అన్ని రకాల అనుమతులు ఉన్న నిర్మాణ సంస్థలను మాత్రమే గుర్తించి ప్రాపర్టీ షోలో ప్రదర్శనకు ఉంచారు. దీంతో ఔత్సాహికులు ఎలాంటి అనుమానాలకు తావులేకుండా క్రయవిక్రయాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇంతటి కార్యాన్ని చేపట్టిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు కృతజ్ఞతలు.
– సందీప్‌కుమార్, నిజామాబాద్
మంచి స్థలం, నచ్చిన ఇల్లు కొనాలంటే ఎన్నో సంస్థలు, దళారులను సంప్రదించాల్సి వస్తుంది. ఎంతో సమయం పడుతుంది. ఇవన్నీ లేకుండా జిల్లా కేంద్రంలోనే చాలా పెద్దపెద్ద రియల్ ఎస్టేట్, బిల్డర్స్‌తోపాటు బ్యాంకర్లను ఒకే దగ్గర ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు తీరాయి. ఎలాంటి బెంగ లేకుండా మాకు నచ్చిన ఇల్లు కొనుక్కోవచ్చు. ఇలాంటి వేదికను నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
– రాగేళ్లి రమేశ్, నిజామాబాద్
ఖాళీ స్థలాలు కొని ఇండ్లు నిర్మించుకోవడానికి, సొంత స్థలాల్లో ఇండ్లను నిర్మించుకోవడానికి మా బ్యాంక్ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నాం. రుణాలను కూడా జాప్యం లేకుండా వెంటనే ఇస్తున్నాం. వచ్చే మార్చి 31 వరకు తీసుకునే రుణాల మంజూరుపై ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ చార్జీలు లేవు. ఈ ప్రత్యేక ఆఫర్‌ను ఖాతాదారులు ఉపయోగించుకోవాలి.
– నరేశ్ కుమార్, సీనియర్ మేనేజర్, కెనరా బ్యాంక్, ఆర్ఏహెచ్ బ్రాంచ్, నిజామాబాద్
హైదరాబాద్‌లోని సుచిత్ర, కొంపల్లిలో 10అంతస్తులతో కూడిన అపార్ట్‌మెంట్స్‌లో 330 ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ఫ్లాట్ ధర రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతున్నది. కావాల్సిన వారు సీతా షల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ని సంప్రదించవచ్చు.
– మాయ శంకర్, సీతా షెల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్
జిల్లా కేంద్రంలోని అమ్మ వెంచర్లో అద్భుతమైన ఇండిపెండెంట్, అపార్ట్మెంట్ భవనాలు అందుబాటులో ఉన్నాయి. ఇండిపెండెంట్ ఇంటి ధర సుమారు రూ. 50లక్షల వరకు ఉండగా అపార్ట్మెంట్లోని ఫ్లాట్ ధర రూ. 39 లక్షల వరకు పలుకుతున్నది. కావాల్సిన వారు రాజవతార్ని సంప్రదించాలి.
– రాజేందర్, నిర్వాహకుడు,
రాజవతార్ కంపెనీ
నూతనంగా నిర్మించే గృహాలకు వారి ఆదాయం, సిబిల్ స్కోర్ ఆధారంగా రుణాలను అందిస్తున్నాం. హౌసింగ్ లోన్ 8.75శాతం వడ్డీతో అందుబాటులో ఉంది. ప్రాపర్టీకి అనుగుణంగా 90శాతం రుణ సౌకర్యం అందిస్తున్నాం.
– అమర్నాథ్, అసిస్టెంట్ మేనేజర్, ఎస్బీఐ