రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్లు ఎందరో.. కాలం ఏదైనా వారి పరుగు మాత్రం ఆగదు. ప్రస్తుతం కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండడంతో చలి పంజా విసురుతున్నది. దీనికి తోడు భారీగా పొగ మంచు సైతం కమ్మేస్తున్నది.
ఉదయం 9 గంటలు అయినా రోడ్లు కనిపించని పరిస్థితి ఏర్పడుతున్నది. గజగజ వణికించే చలిలోనూ తమ బతుకు బండి లాగేందుకు పరుగులు పెడుతున్నారిలా..