నందిపేట్/ఆర్మూర్, అక్టోబర్ 16 : సీఎం కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్‌తో కాంగ్రెస్, బీజేపీలకు మైండ్ బ్లాక్ అయిందని.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతున్నదని.. అందరి ఆశీస్సులతో తాను మళ్లీ గెలిచి హ్యాట్రిక్ సృష్టించబోతున్ననని జీవన్‌రెడ్డి అన్నారు. ‘నమస్తే నవనాథపురం’లో భాగంగా సోమవారం డొంకేశ్వర్ మండలంలోని నూత్పల్లి, ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్ గ్రామాల్లో ప్రజాశీర్వాద యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓటు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మితే ఆగమవుతామన్నారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కాదని.. ఇది ప్రజల మ్యానిఫెస్టో అని, ముచ్చటగా మూడోసారి గులాబీ జెండాను రెపరెలాడించే మ్యానిఫెస్టో అన్నారు. తొమ్మిదిన్నరేండ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేసి, ఇవ్వని హామీలను కూడా ఆచరణలోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. విజన్, కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా ఈ హామీలను సైతం 100 శాతం అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారన్నారు. అందుకే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రజలు సంబురాల్లో మునిగి తేలుతున్నారని.. ప్రతిపక్షాలు మాత్రం నైరాశ్యంలో మునిగిపోయాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సవితా గణేశ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కోమట్‌పల్లి ఉపసర్పంచ్ బీఆర్ఎస్లో చేరిక
ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో డొంకేశ్వర్ మండలం కోమట్‌పల్లి గ్రామ ఉపసర్పంచ్ రాజేశ్వర్ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షిస్తుడై ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజేశ్వర్‌కు జీవన్‌రెడ్డి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు గోపు ముత్యం, ఉపసర్పంచులు పాల్గొన్నారు.